కేటీఆర్-హరీశ్ రావు మాటలు వింటే కడుపు తరుక్కుపోతుంది : డిప్యూటీ సీఎం భట్టి

-

కేటీఆర్-హరీశ్ రావు మాటలు వింటే కడుపు తరుక్కుపోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. వరంగల్ లో ఆయన విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి శంకు స్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గత ప్రభుత్వం అబద్దాలతో పదేళ్లు మోసం చేసిందని పేర్కొన్నారు. కేసీఆర్ ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు.

పదేళ్లు అధికారంలో ఉంది రూ.1లక్ష రుణమాఫీ చేయని వాళ్లు కూడా నేడు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. తాము ఏడాదిలో గ్రూపు-1 పరీక్ష నిర్వహించడంతో పాటు వివిధ శాఖల్లో మొత్తం 56 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ నాయకులు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. తాము అధికారంలోకి వస్తే.. ఈ పనులు చేస్తామని పార్టీకి ఓట్లు వేయించింది నాయకులే అని, అలాంటి నాయకులు ఇప్పుడు ధైర్యంగా ప్రజల వద్దకు ప్రభుత్వ పథకాలను వివరించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news