బంగాళదుంపతో గుండె ఆరోగ్యం పదిలం, మలబద్ధకం దూరం

-

బ్యాచిలర్స్ అయినా ఫ్యామిలీ అయినా సరే.. ఇంట్లో ఏం కూరగాయలు ఉన్నా లేకున్నా బంగాళదుంప, టమోటా, ఉల్లిపాయలు, కోడిగుడ్లు మాత్రం కచ్చితంగా ఉంటాయి. వీటిని అసలు ఖాళీ అవ్వనివ్వరు. ఎందుకంటే..ఇవి ఉంటే చాలు ఏదో ఒక కూర త్వరగా చేయొచ్చు. బంగాళదుంపను చాలా ఎక్కువగా వంటల్లో వాడేస్తారు. అవసరానికి మించి వాడితే ఆరోగ్యానికి నష్టం. కానీ బంగాళదుంపను మితంగా తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి తెలుసా..? ఇది అందాన్ని, ఆరోగ్యాన్ని రెండింటిని కాపాడుతుంది

బంగాళదుంపను డైట్‌లో భాగం చేసుకుంటే మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఎందుకంటే ఇందులో ఫైబర్ చాలా పెద్దమొత్తంలో ఉంటుంది. బంగాళదుంపను తరచూ తినడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది. ఎవరికైనా మలబద్ధకం లేదా ఇతర సమస్యలుంటే బంగాళదుంపతో ఆ సమస్యను దూరం చేయవచ్చంటున్నారు వైద్యులు. బంగాళదుంపలో తగిన మోతాదులో కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. శరీరంలో ఎనర్జీని పెంచుతాయి.

బంగాళదుంపను డైట్‌లో చేర్చుకుంటే చర్మ నిగారింపు మెరుగవుతుంది. బంగాళదుంపలో ఉండే విటమిన్ బి6 కారణంగా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఉడకబెట్టిన బంగాళదుంపను తినడం వల్ల చర్మానికి కొత్త నిగారింపు వస్తుంది. బంగాళదుంప రసంతో స్కిన్ ట్యానింగ్, డార్క్ స్పాట్స్ సమస్య తొలగిపోతుంది. బంగాళదుంప ఏజీయింగ్ సమస్యను పోగొడుతుంది. వారానికి 3-4 సార్లు బంగాళదుంప రసాన్ని రాయడం వల్ల ముఖంపై ఫైన్ లైన్స్, ముడతలు, పింపుల్స్ తగ్గిపోతాయి.

బంగాళదుంపతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో పెద్దమొత్తంలో ఉండే ఫైబర్ కారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా నియంత్రిస్తుంది. బంగాళదుంపను సరైన పద్దతిలో తీసుకుంటే హార్ట్ ఎటాక్ ముప్పు తగ్గిపోతుంది. బంగాళదుంపలో పొటాషియం, విటమిన్ సి, విటమిన్ బీ6 ఉండటం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా అని పరిమితికి మించి తినకండి. ముఖ్యంగా షుగర్‌ పేషెంట్స్‌ బంగాళదుంపను తినకూడదు. వైద్యుల సలహా మేరకే వీటిని వాడాల్సి ఉంటుంది. ఇక అమ్మాయిలు మీ ఫేస్ ప్యాక్‌లో బంగాళదుంప రసాన్ని కూడా యాడ్‌ చేయండి. మోచేతులు, మోకాళ్లు, చంకల్లో ఉండే బ్లాక్‌నెస్‌ పోగొట్టడానికి బంగాళదుపం రసం అద్భుతంగా పనిచేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news