రూమ్‌ను హీట్‌ చేయడానికి హీటర్‌తో పనిలేదు.. ఈ బల్బు ఉంటే చాలు..!!

-

చలి చంపేస్తుంది. రాత్రి పగలు తేడా లేకుండా చలిపెడుతుంది. చాలామంది.. హీటర్లు వాడతారు. కానీ అందరూ హీటర్‌ వాడలేరు. ఒకటికి నాలుగు దుప్పట్లు కప్పుకుని పడుకుంటాం.. అయినా అంత వెచ్చగా ఉండదు.. హీటర్‌ వాడకుండా రూమ్‌ను హీట్‌ చేసుకోవడం ఎలా..? డోర్స్‌, విండోస్‌ అన్నీ క్లోజ్‌ చేసినా ఈ సీజన్‌లో పెద్ద లాభం ఉండదు.. కానీ ఒక ఉపాయం ఉంది..

మార్కెట్లో ఓ బల్బ్ ఉంది. ఈ బల్బు ద్వారా మీరు మొత్తం గదిని సౌకర్యవంతంగా వేడి చేయవచ్చు. లైట్‌తో హీట్‌ ఏంట్రా అనుకుంటున్నారా..? దీనిపైరు ఇన్‌ఫ్రారెడ్ బల్బ్ / లాంప్.. ఇన్ఫ్రారెడ్ ల్యాంప్ అనేది ఒక విద్యుత్ పరికరం. ఇది వెచ్చని కాంతిని అందిస్తుంది. ఇది మాత్రమే కాకుండా, ఇది శరీరానికి కాంతి తరంగదైర్ఘ్యాన్ని ప్రసారం చేయడం ద్వారా నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. ఈ బల్బ్ శీతాకాలంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

కాంతితో పాటు వేడిని కూడా ఉత్పత్తి చేస్తుంది. దీనిని హీటింగ్ బల్బ్ అని కూడా పిలుస్తారు. అలాగే హీట్ థెరపీకి కూడా ఉపయోగిస్తారు. అలాంటి మూడు బల్బులు గురించి చూద్దాం.. PHILIPS 250W E27 230-250V Infrared Heating Lamp- ఈ బల్బ్ ధర రూ.999,..అయితే దీనిని అమెజాన్ నుండి కేవలం రూ.849కే విక్రయించవచ్చు.. ఈ బల్బ్ 230W సామర్థ్యం గలది. ఈ బల్బు సాధారణ పరిమాణ గదిని సులభంగా వెచ్చగా చేస్తుంది.

HCG Health Cure Generation Infrared Bulb 245 V 150 Watt Bulb Base-E 27- ఈ బల్బ్ అసలు ధర రూ.999, అయితే దీనిపై 50% తగ్గింపు ఉంది. ఆ తర్వాత కేవలం రూ.499కే కొనుగోలు చేయవచ్చు. ఈ బల్బు కూడా గదిని సులభంగా వెచ్చగా మార్చగలదు.

Raindrop World IR Bulb Heat Therapy Infrared 150W Screw Based E27- ఈ ఇన్‌ఫ్రారెడ్‌ బల్బును కేవలం రూ.799కి కొనుగోలు చేయవచ్చు. దీనిపై 52% తగ్గింపు కూడా ఉంది. దీని అసలు ధర రూ.1650. ఈ బల్బు ద్వారా శరీరంలో ఏదైనా నొప్పి ఉంటే.. దాన్ని నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది రూమ్‌ని కూడా వెచ్చగా మార్చగలదు..

సో..మీ బడ్జెట్‌లో ఏదీ కావాలంటే అది తీసుకోండి.. హీటర్‌ బదులు తక్కువ ఖర్చులోనే రూమ్‌ను హీట్‌ చేసుకోండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సీజన్‌లోనే చలిగా ఉంటుంది. కాబట్టి అసలు హీటర్ల ఉపయోగం ఎప్పుడూ ఉండదు.. అదే మనాలీ లాంటి ప్రాంతాల్లో అయితే ఏడాదంతా హీటర్‌ కావాల్సిందే.!

Read more RELATED
Recommended to you

Latest news