పాతబస్తీలో హైఅలర్ట్.. భారీగా భద్రతా బలగాల మోహరింపు!!

పాతబస్తీలో పోలీసులు హై అలర్ట్ విధించారు. ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ నేపథ్యంలో పాతబస్తీలో ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థన కోసం ముస్లింలు బయటికి వచ్చే అవకాశం ఉంది. ఆ సమయంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసుల భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ మేరకు పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో భద్రతా బలగాలు మోహరించాయి.

చార్మినార్-భద్రతా బలగాలు
చార్మినార్-భద్రతా బలగాలు

చార్మినార్, మక్కా మసీద్ ఏరియాల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. కాగా, రాజాసింగ్ అరెస్ట్ పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్‌పై ఉద్యమం చేసినా ఫలించదన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం పీడీయాక్ట్ పెట్టి జైలుకు పంపిందన్నారు. శాంతియుతంగా ప్రార్థనలు నిర్వహించుకోవాలని ముస్లింలకు పిలుపునిచ్చారు.