సీన్ రిపీటైంది… హైదరాబాద్ మళ్లీ వణికిపోయింది. రాజధానిని శనివారం వర్షం మళ్లీ హడలెత్తించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం జన జీవనాన్ని అతలాకుతలం చేసింది. మంగళ, బుధ వారాల్లో కురిసిన రికార్డు వర్షం తాలూకు వరదతో కాలనీలు ఇంకా తేరుకోకముందే వరుణుడు పగబట్టిన రీతిలో… మళ్లీ ఆ ప్రాంతాల్లోనే శనివారం సైతం కుండపోతగా వర్షం కురిసింది. శనివారం సాయంత్రం ఆరు గంటల నుండి హయత్‌నగర్, ఉప్పల్, ఎల్బీనగర్, మలక్ పేట, చార్మినార్, చాంద్రాయణగుట్ట, బాలాపూర్, మీర్‌పేట, పోచారం, ఘట్కేసర్‌లలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది.
దీంతో హైదరాబాద్– వరంగల్, హైదరాబాద్ – విజయవాడ ప్రధాన రహ దారితో పాటు నగరంలోని రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. ఈ రెండు రూట్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చినుకుపడితేనే గజగజ వణుకుతు న్న నగరవాసులు ఇంటికి చేరేందుకు తొందరపడ టంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. పాతబస్తీలోని ఛత్రినాకలో వరదనీటిలో పలు వాహæనాలు మళ్లీ కొట్టుకుపోయాయి. ఫలక్‌నుమా రైల్వే బ్రిడ్జి పైభాగంలో భారీ గొయ్యి పడటంతో బ్రిడ్జిని మొత్తం మూసేశారు. పాతబస్తీ బాబానగర్ పరిధిలో ని గుర్రంచెరువు గండి మరింత పెద్దది కావటంతో వరద ఉధృతి పెరిగింది. ఇప్పటికే ఉప్పల్, ఎల్బీ నగర్, అంబర్‌పేట ప్రాంతాల్లో నాలుగు రోజులుగా వరదనీటిలోనే మునిగిన కాలనీల్లో శనివారం నాటి వర్షం పరిస్థితిని మళ్లీ మొదటికి తెచ్చింది.