హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణకు రెయిన్ అలెర్ట్ జారీ చేసింది. నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది హైదరాబాద్ వాతావరణ. మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిశాల మీదుగా బంగాళాఖాతం వరకు 1,500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడిందని, మరోవైపు ఒడిశాపై గాలులతో ఉపరితల ఆవర్తనం 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉందని హైదరాబాద్ వాతావరణ పేర్కొంది.
ఈ ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది హైదరాబాద్ వాతావరణ. భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. ఈ సీజన్‌లో రుతుపవనాలు మరింత ఉధృతమై మంచి వర్షాలు
కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.