తమిళనాడులో కరోనా కల్లోలం.. నేటి నుంచి ఈ నిబంధనలు అమలు!

-

తమిళనాడులో కరోనా ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో తమిళనాడు రాష్ట్రంలోనే భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో కరోనా నిబంధనలు పాటించాలని, కరోనా నివారణ చర్యలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది. కోవిడ్ ప్రోట్‌కాల్‌లకు కట్టుబడి ఉండకుండా.. ప్రజలు అలసత్వం ప్రదర్శిస్తున్నారని.. అందుకే రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రతిఒక్కరూ మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు.

తమిళనాడు-కరోనా
తమిళనాడు-కరోనా

బహిరంగ ప్రదేశాల్లో కరోనా నిబంధనలు పాటించని వారిపై పబ్లిక్ హెల్త్ యాక్ట్-1939 ప్రకారం జరిమానా విధిస్తామని తమిళనాడు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అలాగే కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యలను పెంచాలని వైద్యశాఖకు సూచించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని సీఎం స్టాలిన్ తెలిపారు.

కాగా ఆదివారం ఒక్కరోజే దాదాపు 1,472 కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 34,68,344కి చేరుకోగా.. 7,458 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరణాల సంఖ్య 38,036కి చేరింది. అలాగే 691 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news