తెలంగాణకు నేడు, రేపు భారీ వర్ష సూచన..

-

తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రం‌లోని పలు జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నదని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం తెలి‌పింది. ఉత్తర–‌ద‌క్షి‌ణ‌ద్రోణి తూర్పు విద‌ర్భ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు విస్తరించి, సముద్ర మట్టా‌నికి 0.9కిలో‌మీ‌టర్ల ఎత్తు వరకు కొన‌సా‌గు‌తు‌న్నదని వెల్లడిం‌చింది. పశ్చిమ, నైరుతి దిశ నుంచి రాష్ట్రంలోకి కింది స్థాయి గాలులు వీస్తు‌న్నా‌యని పేర్కొ‌న్నది. కాగా, హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంది.

IMD issues red alert for several Telangana districts, heavy rain forecast  for next 48 hours - India News

సోమవారం తెల్లవారుజామున నగరంలో అక్కడక్కడ వర్షం కురిసింది. ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట, కోఠి, ఉప్పల్‌, నాగోల్‌లో చిరుజల్లులు కురిశాయి. ఇదిలా ఉంటే.. వినాయక చవితి సందర్భంగా ఇప్పటికే గణపతి మండపాలను రాష్ట్రావ్యాప్తంగా జోరుగా ఏర్పాటు చేశారు. అయితే.. భారీ వర్ష సూచన నేపథ్యంలో.. గణేష్ మండప నిర్వాహకులు అప్రమత్తమయ్యారు.

 

Read more RELATED
Recommended to you

Latest news