Breaking : భాగ్యనగరంలో పలు చోట్ల భారీ వర్షం..

-

భాగ్యనగరాన్ని వరుణుడు వీడనంటున్నాడు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలుకు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. బంజారాహిల్స్‌, మియాపూర్‌, చందానగర్‌, ఖైరతాబాద్‌, సోమాజీగూడ, ముషీరాబాద్‌, చిక్కడపల్లి, బోలక్‌పూర్‌, కవాడిగూడ, జవహర్‌నగర్‌, దోమల్‌గూడ, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, అల్విన్‌ కాలనీ, నిజాంపేట్‌, ప్రగతినగర్‌ ప్రాంతాల్లో శనివారం వేకువజామున భారీ వర్షం కురిసింది. నైరుతి బంగా‌ళా‌ఖా‌తంలో ఏర్పడిన ఉప‌రి‌తల ఆవ‌ర్తనం ప్రభా‌వంతో రాష్ట్రంలో ఈ నెల 17 వరకు తేలి‌క‌పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నదని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం తెలి‌పింది.

Heavy rain lash Hyderabad overnight

శని‌వారం ఆది‌లా‌బాద్‌, నిజా‌మా‌బాద్‌, జయ‌శం‌కర్‌ భూపా‌ల‌పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహ‌బూ‌బా‌బాద్‌, వరం‌గల్‌, జన‌గామ, యాదాద్రి భువ‌న‌గిరి, రంగా‌రెడ్డి, హైద‌రా‌బాద్‌, మేడ్చల్‌ మల్కా‌జి‌గిరి, వికా‌రా‌బాద్‌, సంగా‌రెడ్డి, మెదక్‌, కామా‌రెడ్డి, మహ‌బూ‌బ్‌‌న‌గర్‌, నారా‌య‌ణ‌పేట జిల్లాల్లో అక్కడ‌క్కడ ఉరు‌ములు, మెరు‌పు‌లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నదని ప్రాథ‌మిక హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ.

 

Read more RELATED
Recommended to you

Latest news