మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. బాపట్ల జిల్లా చుండూరు మండలం వలివేరులో అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడు కనుక గతంలో సరిగ్గా పాలించి ఉంటే 2019 ఎన్నికల్లో ప్రజలు ఆయనను చిత్తుగా ఎందుకు ఓడించి ఉండేవారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో దత్తపుత్రుడు పవన్ కల్యాణ్, బీజేపీలకు దగ్గరయ్యేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
గ్రామస్థాయిలో సచివాలయాలు ఏర్పాటు చేసిన తర్వాత సమస్యలు స్థానికంగానే పరిష్కారమవుతున్నాయని, సామాన్యులకు ఇక రాష్ట్ర సచివాలయంతో పనేంటని ప్రశ్నించారు సజ్జల రామకృష్ణారెడ్డి. అందుకనే పరిపాలన రాజధానిని విశాఖకు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. మంత్రి నాగార్జున మాట్లాడుతూ ఆరు నూరైనా మూడు ప్రాంతాల్లోనూ రాజధానులు ఏర్పాటు చేస్తామన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.