భారీ వర్షాలు.. మహబూబాబాద్‌లో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్!

-

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండ్రోజులుగా రాష్ట్రంలో గ్యాప్ ఇవ్వకుండా వర్షాలు కురుస్తుండటంతో వాగులు, చెరువులు నిండుకున్నాయి. ఇప్పటికే తెలంగాణలోని 5 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కుండపోత వర్షాల కారణంగా పలు రైళ్లు సైతం రద్దవ్వగా మరికొన్నింటిని దారి మళ్లించినట్లు దక్షిణ మధ్యరైల్వే అధికారులు ఇప్పటికే ప్రకటించారు.

ఇదిలాఉండగా, భారీ వర్షాలకు వరద ప్రవాహం పెద్ద ఎత్తున కొనసాగుతుండటంతో మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. కేసముద్రం-ఇంటికన్నె మార్గంలో ట్రాక్‌ను ఆనుకుని వరద నీరు ప్రవహిస్తుండటంతో ట్రాక్ కింద ఉండే రాళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. విద్యుత్ స్థంభాలు సైతం పక్కకు ఒరిగాయి. దీంతో ఈ మార్గంలో రైళ్లు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమీప స్టేషన్లలో పలు రైళ్లను నిలిపివేయగా, కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు రైల్వే స్టేషన్లలో పడిగాపులు గాస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news