కూలిన SLBC టన్నెల్ సంఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కూలిన SLBC టన్నెల్ వద్ద రూ.2.36 కోట్లతో హెలికాప్టర్ సర్వే చేయనుంది తెలంగాణ రాష్ట్ర సర్కార్. ఈ హెలికాప్టర్ సర్వేను నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (NGRI)కి నామినేషన్ ప్రాతిపదికన అప్పగించింది.

ఈ హెలికాప్టర్ సర్వే కోసం రూ.2.36 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం… జీవో జారీ చేసింది. ఇది ఇలా ఉండగా ఎస్ఎల్బిసి టన్నెల్ సంఘటన గత మూడు నెలల కిందట జరిగిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి నెలలో ఈ సంఘటన.. జరగగా 8 మంది సొరంగంలోకి వెళ్లారు. కానీ ఇద్దరి శవాలు మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెలికి తీయగలిగింది. మిగిలిన డెడ్ బాడీ లు ఎక్కడ దొరకలేదు. అయితే బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది.