ఓట్స్ సాగు విధానం, విత్తనాలు, దిగుబడి మరియు తెగుళ్లు గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే..!

-

ఈ మధ్య కాలంలో చాలా మంది ఓట్స్ ని ఎక్కువగా తింటున్నారు. ఉదయం పూట అల్పాహారం సమయంలో ఎక్కువగా ఓట్స్ ని తీసుకుంటున్నారు. దీని వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. అయితే ఓట్స్ ని సాగు చేసే విధానం గురించి, విత్తనాలు రేటు, దిగుబడి మరియు తెగుళ్ళు మొదలైన విషయాలను ఇప్పుడు చూద్దాం.

ఈ మధ్య కాలంలో చాలా మంది ఓట్స్ ని పండించడానికి కూడా చూస్తున్నారు. అలాగే వాటిని పండించడం వల్ల నేల నష్టం నుండి భూమిని రక్షించుకోవడం కి సహాయ పడతాయి. దక్షిణ డకోటా, ఉత్తర డకోటా, మిన్నెసోటా వంటి చోట ఓట్స్ ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తూ ఉంటారు. ఓట్స్ చల్లని తేమ వాతావరణంలో బాగా పెరుగుతాయి.

20 నుంచి 21 ఉష్ణోగ్రత ఉన్న చోట ఎదుగుదల బాగుంటుంది. అనేక మట్టి రకాల్లో పెరగడానికి అనుకూలంగా ఉంటాయి. తడి నేలలను ఇవి ఎక్కువగా ఇష్ట పడతాయి. వేసవి మొదటి అర్ధ భాగంలో తడి సంవత్సరాల్లో ఓట్స్ బాగా దిగుబడినిస్తుంది. ఈ తృణ ధాన్యాలను పెద్దగా శ్రద్ధ అక్కరలేదు.

ఓట్స్ సాగుకి ఎన్ని విత్తనాలు అవసరం..?

ఒక ఎకరం భూమి కి 25 కిలోల విత్తనాలు అవసరం.

ఓట్స్ దిగుబడి:

పశుగ్రాసం కోసం సాగు చేసినట్లయితే హెక్టారుకు సగటున రెండు వందల ఇరవై నుండి 300 వరకూ సుమారు ఐదు క్వింటాళ్ల ధాన్యం పొందొచ్చు వాటిని ధాన్యం కోసం సాగు చేసినట్లయితే సగటున ఒక హెక్టార్ కి 15 నుండి 20 క్వింటాళ్ల వరకు గడ్డి దిగుబడి సుమారు 25 క్వింటాళ్ల వరకు సాధించొచ్చు.

ఓట్స్ సాగులో తెగుళ్ళు:

ఎక్కువగా ఫంగస్ వ్యాధికి గురయ్యే అవకాశం ఉంటుంది. పైగా వీటిని గుర్తించడం కూడా కష్టం. నల్లమట్టి మండలాల్లో అత్యంత సాధారణం అలానే పుష్పించే వద్ద అధిక తేమ పరిస్థితులలో కానీ గాలి మరియు సోకినా విత్తనం నాటడం వల్ల కానీ ఇది వస్తుంది. ఓట్స్ కీటకాల కి గురయ్యే అవకాశం మాత్రం లేదు. కానీ కట్ వార్మ్ లు, వైర్ వార్ములు, అఫిడ్ లు పంటలకు నష్టాన్ని కలిగిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news