అలా చేసి కెరియర్ నే నాశనం చేసుకున్న హీరో ఆకాష్..!

-

సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా సరే సమయానికి అనుకూలంగా వ్యవహరిస్తేనే అక్కడ నెగ్గుకు రాగలరు. అంతేకానీ తాను చెప్పిందే వినాలి అని మొండికేసి కూర్చుంటే మాత్రం ఇండస్ట్రీ నుంచి దూరం అవ్వాల్సి ఉంటుంది. సరిగా అలాంటి పరిస్థితి ఎదుర్కొన్నాడు హీరో ఆకాష్.. తెలుగులో ఆనందం వంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయిన ఇతడు.. పుట్టడమే గోల్డెన్ స్పూన్ తో పుట్టాడు. అందుకే నిర్మాతగా మారి కొన్ని సినిమాలు కూడా నిర్మించాడు. సినిమా తప్ప మరో ప్రపంచం తెలియని ఆకాష్ కు దర్శకత్వం కూడా తెలుసు. అయితే ఎన్ని చేసినా సరే స్టార్ సెలబ్రిటీగా ఎదగలేకపోయాడు.

ఎల్లప్పుడూ తాను మాత్రమే గొప్ప అని అనుకునే ఆకాష్ తన చుట్టూ ఏం జరుగుతోంది? ప్రపంచం ఎలా అప్డేట్ అవుతోంది? అనే విషయాలను మాత్రం ఆయన గ్రహించలేకపోయాడు. దాంతో ఆకాష్ తీసిన ఏ సినిమా కూడా విజయం సాధించలేకపోయింది. పైగా ప్రతి సినిమాకి ఏదో ఒక కాంట్రవర్సీ కూడా మొదలయ్యేది. దాంతో అతడు సినిమా ఇండస్ట్రీకి పనికి రానివాడిగా చేసేసింది. ఆ తర్వాత తెలుగులో సునీల్ హీరోగా నటించిన అందాల రాముడు సినిమాలో ఒక పాత్రలో నటించాడు ఆకాష్.

అంతేకాదు ఇటీవల తెలుగు అమ్మాయి సునయన ను కూడా తమిళ్లో పరిచయం చేస్తూ కదలిల్ విజ్హున్తెన్ అని చిత్రం తీసి ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం తర్వాత మాధవ్ అనే ఒక సినిమా చేయాల్సి ఉండగా ఆ సినిమాలో కూడా ఆమెని హీరోయిన్గా తీసుకున్నాడు ఆకాష్ . అయితే కొన్ని రోజులు షూటింగ్ తర్వాత సినిమా ఆగిపోయింది. ఆమె డేట్స్ ఖాళీ లేకపోవడంతో రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తే చేస్తానని చెప్పిందట. దీంతో పెద్ద గొడవ జరిగింది. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఆకాష్ సునయనపై కేసు కూడా వేశాడు. మొత్తానికైతే చిలికి చిలికి గాలి వానగా మారి సినిమా కూడా ఆగిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news