సహనం కోల్పోయిన కొమ్మినేని.. అవును చేతకాదంటూ..

-

ఏపీ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు పూర్తిగా సహనం కోల్పోయారు. నెల్లూరు జిల్లా కందుకూరులో విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అసలు మిమ్మల్ని ఎవరు పిలిచారని ఒకసారి, నేను సమాధానం చెప్పనని మరోసారి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం సమాధానం చెప్పలేనపుడు ఇక్కడికి ఎందుకొచ్చారన్న విలేకరుల ప్రశ్నకు.. ‘అవును.. నాకు చేతకాదు’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

గత నెల 28న కందుకూరులో టీడీపీ సభలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని ఆయన శుక్రవారం స్థానిక పోలీసులతో కలిసి పరిశీలించి, విలేకర్లతో మాట్లాడారు. ఘటనలో పోలీసుల వైఫల్యం ఏమీ లేదని, ఇరుకు రోడ్లలో రోడ్‌షో, డ్రోన్‌ షూట్‌ నిర్వహించడం వలనే తొక్కిసలాట జరిగిందని చెప్పారు. పత్రికలో కావాలనే అసత్య వార్తలు రాస్తున్నారని అన్నారు. జర్నలిజం పేరుతో ఇలాంటి రాతలు సరికాదని, రాజకీయ పార్టీకి కొమ్ముకాయాలనుకుంటే నేరుగా ముద్ర వేసుకోవాలని వ్యాఖ్యానించారు.

దీనిపై పలువురు విలేకరులు అభ్యంతరం తెలిపారు. మీరు జర్నలిజంలో ఉంటూ ఓ పార్టీకి కొమ్ముకాయడం లేదా అంటూ ప్రశ్నించారు. ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ అయి ఉండి రాష్ట్రంలోని విలేకర్లకు ఏం మేలు చేశారు? కరోనా సమయంలో ఎంతమందిని ఆదుకున్నారు? ఎక్రిడిటేషన్లు ఎంత మందికి ఇచ్చారో సమాధానం చెప్పాలని విలేకర్లు పట్టుబట్టారు. దీంతో కొమ్మినేని సమాధానం చెప్పలేక ‘అవును.. నాకు చేతకాదు’ అంటూ అక్కణ్నుంచి వెనుదిరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news