భర్త న్యూడ్ పిక్​ తీసిన గుత్తాజ్వాల.. నెట్టింట వైరల్

-

ఇటీవలే లైగర్ సినిమాకు సంబంధించి ఓ న్యూడ్ పిక్​తో సెన్సెషన్ క్రియేట్ చేశాడు విజయ్ దేవరకొండ. ఆ మేనియా నుంచి ఫ్యాన్స్ తేరుకోకముందే ఓ మేగజైన్​ కోసం న్యూడ్ పిక్స్ దిగి మరో సంచలనం సృష్టించాడు రణ్​వీర్ సింగ్. ఇప్పుడు ఆ క్లబ్​లోకి తమిళ్ హీరో విష్ణు విశాల్​ కూడా జాయిన్ అయ్యాడు. కానీ అతడి ఫొటో తీసింది మాత్రం స్వయంగా అతడి భార్య గుత్తాజ్వాల.

బెడ్ పై పడుకుని సెమీ న్యూడ్‌గా ఫోజు ఇచ్చిన కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ ఆ ఫొటోను స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. నడుము కింది భాగం వరకు ఆయన బాడీ పిక్‌లో కనిపిస్తున్నది. ఆ తర్వాత దుప్పటి కప్పుకుని ఉన్నది. బోల్డ్‌గా ఉన్న ఈ పిక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తాను కూడా ట్రెండ్‌లో నిలిచానని విష్ణు అన్నాడు. ఈ ఫొటో తన భార్య గుత్తాజ్వాల తీసినట్లు చెప్పాడు. సతీమణి గుత్తాజ్వాల ఫొటోగ్రాఫర్ మారిన వేళ అంటూ కామెంట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news