భారీ వర్షం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..?

-

ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాలను ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. ఏ క్షణాన భారీ వర్షం కురుస్తుంది అన్నది కూడా ఊహకందని విధంగా ఉంది. అప్పటి వరకు భారీగా వేడిగా ఉన్న సమయంలో కూడా నిమిషాల వ్యవధిలోనే వాతావరణం మారిపోయి భారీ వర్షం కురుస్తోంది. ఈ క్రమంలోనే ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అయితే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అందరూ తగిన జాగ్రత్తలు పాటించాలి అని ఆటు అధికారులు వైద్య నిపుణులు కూడా సూచిస్తున్న విషయం తెలిసిందే. అయితే భారీ వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున కిటికీలకు తలుపులకు దోమతెరలు ఏర్పాటు చేయడంతో పాటు వేడి గా ఉన్న ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు అంతేకాకుండా కరెంట్ స్తంభాలను పట్టుకోవడం తెగిపోయిన వైర్ లను ముట్టుకోవడం లాంటివి చేయకూడదు. అత్యవసరం దృశ్య ఎప్పుడు ఫోన్లో చార్జింగ్ నిండుగా ఉండేలా చూసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news