విశాఖలో రియల్ బూమ్ కుదేలు..కారణం ఇదే…!

-

విశాఖలో రియల్ ఎస్టేట్ రంగం నేల చూపులు చూస్తోంది. వేల కోట్ల రూపాయలకు పడగలెత్తిన వ్యాపారం… ఇప్పుడు ఒక్క సారిగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఎగ్జిక్యూటివ్‌ రాజధాని జోష్‌ను కరోనా చావుదెబ్బ కొట్టింది. బేరసారాలు తప్ప అమ్మకాలు-కొనుగోళ్లు లేవు. లక్షలు, కోట్లు అనే అంకెలు తప్ప… రిజిస్ట్రేషన్ల దాఖాలాలు కనిపించడం లేదు. దసరా తర్వాత బూమ్‌ వస్తుందనే అంచనాల్లో వ్యాపారులు ఉంటే… భారీగా పెరిగిన ధరలు చూసి వెనక్కితగ్గుతున్నారు పెట్టుబడిదారులు.

విశాఖను ఎగ్జిక్యూటివ్‌ రాజధాని చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో పెట్టుబడిదారుల్లో ధీమా మరింత పెరిగింది. ఈ ఏడాది ప్రధమార్ధంలో వైజాగ్‌లో రియల్ బిజినెస్ తారాజువ్వలా దూసుకుపోయింది. కొత్త కొత్త వెంచర్లు, అపార్టుమెంట్ నిర్మాణాలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. భవిష్యత్తులో పెరిగే నగరం… జనావాసాలను లెక్కలేసుకుని భారీగా పెట్టుబడులు పెట్టారు. వేగంగా అభివృద్ధికి ఆస్కారం వున్న చోట్ల భూముల ధరలు 200 శాతం పెరిగాయి. అయితే బూమింగో లేక ఇంకేదో అని తేలేలోపే విశాఖలో రియల్ ఎస్టేట్‌ రంగానికి అగ్నిపరీక్ష మొదలైంది. రియల్ బూమ్‌ను కరోనా కకావికలం చేసేసింది.దసరా తర్వాత స్తిరాస్ధి వ్యాపారం దశ తిరుగుతుందనే అంచనాల్లో ఉన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు.

Read more RELATED
Recommended to you

Latest news