మిషన్ బిల్డ్ ఏపి పై హైకోర్టు లో విచారణ జరిగింది. ప్రభుత్వ ఆస్తుల విక్రయాలు ఆపేయాలని పిల్ దాఖలు చేసారు సామాజిక కార్యకర్త సురేష్. విచారణ అక్టోబర్ 16 కు వాయిదా వేసింది ధర్మాసనం. విచారణ సందర్భంగా ఆసక్తకర వ్యాఖ్యలు చేసింది. ప్రతి పనికి అడ్డు తగులుతున్నారని, పరిపాలన కూడా వారినే చేసుకోమనని ఏజి అన్నారు. దీనిపై హైకోర్ట్ స్పందించి ఆసక్తికర వ్యాఖ్య చేసింది.
మీరు ఎవరిని ఉద్దేశించి అన్నారు…? హైకోర్టు నా..? లేక పిటిషనర్ లను అన్నారా…? అని ప్రశ్నించారు న్యాయమూర్తి. హైకోర్ట్ ని కాదు అని ఏజీ బదులు ఇచ్చారు. అన్నింటి పై నా విచారణ చేసి తీర్పు ను అక్టోబర్ 16న వెలువరిస్తామని ధర్మాసనం పేర్కొంది. ప్రతివాదులు గా ఉన్న అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులను కౌంటర్ దాఖలు చేయాలని దర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.