టీడీపీ అధినేత చంద్రబాబు కేసు తీర్పు కాసేపట్లో వెలువడనుంది. చంద్రబాబుకు బెయిల్ వస్తుందా?లేక రిమాండ్ కు తరలిస్తారా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. కోర్టు ప్రాంగణం నుండి సుమారు 3 కిలో మీటర్ల మేర తమ అధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. మరో వైపు టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో విజయవాడ ఏసీబీ కోర్టు దగ్గరకు చేరుకుని చంద్రబాబుకు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది
ఇదిలా ఉంటే తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు ఆంక్షలు విధించారు.144 సెక్షన్ అమలులో ఉన్నట్లు ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు రిమాండ్ విధిస్తారనే ప్రచారం జరిగింది. రిమాండ్ విధిస్తే చంద్రబాబును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు 144 సెక్షన్ అమలులో ఉన్నట్లు ప్రకటించారు. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొనసాగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తుగా ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.