దేనా దొరా.. మీరు చెప్తున్న రైతు రాజ్యం? : షర్మిల

-

రాష్ట్రంలో కేసీఆర్ పాలన ఎట్లున్నదో సొసైటీల ముందట ఎరువుల కోసం నిలుసున్న రైతన్నలను అడిగితే తెలుస్తుందని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఇదేనా దొరా.. మీరు చెబుతున్న రైతు రాజ్యం..? అని ప్రశ్నించారు.  తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన ఎట్లున్నదో సొసైటీల ముందట ఎరువుల కోసం నిలుచున్న రైతన్నలను అడిగితే తెలుస్తుందన్నారు. ఎరువుల కోసం పడిగాపులు కాయడమేనా రైతు సంక్షేమం..? అని ప్రశ్నించారు. రాష్ట్ర రైతులకు 26 లక్షల టన్నుల ఎరువులు ఉచితంగా ఇస్తామంటూ ఊదరగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

YS Sharmila to recommence padayatra

ఇచ్చిన హామీ నెరవేర్చాలన్న చిత్తశుద్ది కేసీఆర్ సర్కారు లేదని షర్మిల ఫైర్ అయ్యారు. ఉచితం మాట అటుంచితే ఎరువులు కొందామన్నా దొరకని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది అన్నారు. రైతును రాజు చేశానని గప్పాలు కొట్టుకుంటూ ఎరువుల కోసం సొసైటీల ముందట నిల్చోబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కొరతతో ఇబ్బందులు పడుతుంటే రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news