హైదరాబాద్‌లో మరోసారి టెన్షన్‌.. టెన్షన్‌..

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో బీజేపీ బహిష్కృత నేత నుపుర్‌ శర్మ ఫోటోను ఫోన్‌లో స్టేటస్‌గా పెట్టుకున్నాడనే కారణంగా ఓ ట్రైలర్‌ను ఇద్దరు వ్యక్తులు హత్య చేశారు. అంతేకాకుండా హత్యకు సంబంధించిన వీడియోను చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో అది వైరల్‌గా మారింది. అయితే.. ఈ ఘటన జరిగిన గంటలోనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా ఈ ఘటనను సుమోటాగా కోర్టు తీసుకుంది.

High alert in Hyderabad

అయితే.. ఇప్పటికే నుపుర్‌ వర్మ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్‌లోని పాతబస్తీ, జగదీశ్‌మార్కెట్‌, తదితర ప్రాంతాల్లో సైతం నుపురశర్మ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన విషయం తెలిసింద. అయితే ఉదయ్‌పూర్‌ టైలర్‌ హత్యతో మరోసారి హైదరాబాద్‌లో టెన్షన్‌ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు పహారా కాస్తున్నారు.