ఆయేషా మీరా హత్య కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు..

-

సీబీఐ కి అప్పగిస్తూ ఆదేశాలు జారీ…
సిట్ బృందంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా నిలిచిన ఆయేషా మీరా హత్యకేసుని .. సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. కేసును ప్రారంభ స్థాయి నుంచి మరో సారి విచారణ జరపాలని తెలిపింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు సరిగా లేదని హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. విజయవాడలో ఆయేషా మీరా హత్య జరిగిన తర్వాత ఈ కేసులో సత్యంబాబును దోషిగా తేలుస్తూ 2010లో విజయవాడ కోర్టు తీర్పు వెలువరించి విషయం తెలిసిందే. అయితే తాను నిర్దోషినంటూ సత్యంబాబు హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లారు. ఆయన అప్పీల్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం 2016లో సత్యంబాబును నిర్దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చింది. మొదటి నుంచి సత్యం బాబుకి కేసుతో ప్రమేయం లేదని ఆయేషా మీరా తల్లి చెప్పడంతో పాటు అసలు దోషులు తప్పించుకున్నారని ఆమె ఆరోపించారు.

దీంతో మొత్తం ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని ఆయేషా తల్లితో పాటు పలు ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దీనిపై సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్ ప్రతీ సారి ఏదో ఓ కారణంగా కేసుని సరిగ్గా దర్యాప్తు చేయడం లేదని భావించి సీబీఐతో విచారణ జరిపిస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చింది. కేసుని తాజాగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news