ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తరచూ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే జిల్లాల్లో నంద్యాల ఒకటి. భూమా ఫ్యామిలీ చుట్టూ తిరిగే రాజకీయాలు వేడిని రగిలిస్తూనే ఉంటాయి. తాజాగా ఆళ్లగడ్డలో.. మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దాంతో ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఈ కారణంగా ఆళ్లగడ్డలో.. ఉద్రిక్త పరిస్థితి ఉంది. పోలీసులు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. తనతో బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే శిల్పారవికి అఖిలప్రియ సవాల్ విసిరారు. ఐతే… ప్రస్తుతం ఆళ్లగడ్డలో 30 యాక్ట్ అమల్లో ఉంది. ఇలాంటి సమయంలో… ఈ సవాళ్లు, బహిరంగ చర్చలు కుదరవని పోలీసులు తెలిపారు. అందుకు అఖిలప్రియ ఒప్పుకోకపోవడంతో… ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు.
దీంతో.. నంద్యాలకు భూమా అఖిల ప్రియను వెళ్లనివ్వకుండా నోటీసులివ్వడంపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు అఖిల ప్రియ తరుఫు న్యాయవాది. దీంతో.. పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టుకు అఖిల ప్రియకు నోటీసులిచ్చి నంద్యాల వెళ్లనివ్వలేదని హైకోర్టుకు అఖిల ప్రియ తరపు అడ్వకేట్ తెలిపారు. శిల్పా రవికి నోటీసులు ఇచ్చారా అని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించారు. ఇవ్వలేదని పోలీసులు చెప్పారు. శిల్పా రవి రాకుండా డిబేట్ ఎలా జరుగుతుందన్న హైకోర్టు… రేపు ఉదయం 9.45 గంటల వరకూ నంద్యాల వెళ్లకుండా నోటీసులు ఇచ్చామని ప్రభుత్వ న్యాయవాది వివరించారు. రేపు ఉదయం వరకూ నంద్యాల వెళ్లబోమని, అండర్ టేకింగ్ ఇస్తే తాము అఖిల ప్రియ నివాసం వద్ద నుంచి వెళ్లిపోతామని పోలీసులు వెల్లడించారు. నంద్యాల మినహా, ఎక్కడైనా అఖిల ప్రియ తిరగవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. అండర్ టేకింగ్ ఇచ్చిన వెంటనే పోలీసులు అక్కడ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది హైకోర్టు. అండర్ టేకింగ్ ఇచ్చిన తర్వాత నోటీసు కూడా ఉపసంహరించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. సీఐకు అండర్ టేకింగ్ ఇవ్వాలని అఖిల ప్రియకు హైకోర్టు ఆదేశించింది.