పుదీనాతో అధిక లాభాలు..ఒక్కసారి ఇలా వేస్తే రెండేళ్ల పాటు ఆదాయం..

-

మన దేశంలో అధికంగా పండించే ఆకు కూరల్లో పుదీనా ఒకటి.. సారవంతమైన నేలలు పుదీనా సాగుకు అనుకూలంగా ఉంటాయి. తేలికపాటి నేలలు, మురుగు నీటి వసతి ఉన్న ఒండ్రునేలల్లో పుదీనాను సాగు చెయ్యొచ్చు.. అయితే ఈ పుదీనాను రెండు పద్దతుల ద్వారా సాగు చెయ్యొచ్చు.. ఎలాగైనా కూడా మంచి లాభాలను పొందవచ్చు..

ఒకటి కాండం ను మొక్కలుగా నాటుకోవటం, రెండు విత్తనాలను వేయటం ద్వారా సాగు చేయవచ్చు. నవంబరు నుండి డిసెంబరు మసాల్లో పుదీనా సాగుకు అనుకూలమైనది చల్లవాతావరణం పంటకు అనుకూలంగా ఉంటుంది. స్వల్పకాల వ్యవధిలో అధిక అదాయాన్ని ఇచ్చే పంటగా పుదీనా ప్రసిద్ధి చెందింది. చాలా మంది రైతులు పుదీనా సాగు చేపట్టి అధిక అదాయాన్ని ఆర్జిస్తున్నారు. షెడ్ నెట్ విధానంలో సైతం దీనిని సాగు చేయవచ్చు. అర ఎకరం పొలంలో పుదీనా సాగుకు 10 వేల వరకు ఖర్చవుతుంది. ప్రతి నెల 20 నుండి 30 వేల వరకు అదాయం పొందవచ్చు.

పుదీనాలో ఎరువుల, నీటి యాజమాన్యం..

పుదీనా మొక్కలు నాటిన తర్వాత 25 రోజులకు ఒకసారి కలుపు మొక్కలను ఎరివేయాలి. మొక్కలు పెరుగుతున్న దశలో కలుపు ను నివారించటం ఇబ్బందిగా మారుతుంది. అలాగే ఒక కూత పూర్తయిన తరువాత తిరిగి కలుపు నివారణ చేపట్టాలి. పుదీనా వేర్లే నేలపై భాగంలోనే పరచుకుని ఉంటాయి. కాబట్టి తక్కువ మోతాదులో నీటి తడులు ఇవ్వాలి. వేసవి సమయంలో 4 రోజులకు ఒకసారి నీటితడులు ఇవ్వాల్సి ఉండగా చలికాలంలో 12 రోజులకు ఒకసారి నీరు అందించాల్సి ఉంటుంది..ఎండ తీవ్రతను బట్టి నీటిని అందించాలన్న విషయాన్ని గుర్తుంచుకోండి..

పుదీనా పంట పశువుల ఎరువు చాలా ముఖ్యమైనది.. ఎరానికి 5 టన్నుల పశువుల ఎరువు , 20 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ లను వేసుకోవాలి. పుదీనాలో కాండం కుళ్లు వంటి సమస్యలను ఎదుర్కొవాలంటే మాత్రం పంట మార్పిడి చెయ్యాలి.. ఎటువంటి సమస్యలున్నా, లేదా మరింత సమాచారం కోసం వ్యవసాయ నిపునుల సలహా తీసుకోవడం మంచిది..

Read more RELATED
Recommended to you

Latest news