కోవిడ్‌ మౌత్‌ వ్యాక్సిన్‌.. డబ్ల్యూహెచ్ఓ ప్రాథమిక అనుమతి

-

యావత్తు మానవాళి జీవితాలకు ప్రశ్నార్థకంగా మారిన కోవిడ్‌ మహమ్మారి ఎంతో మంది జీవితాలపై కోలుకోలేని దెబ్బకొట్టింది. అయితే.. ఇప్పటికే పలు వాక్సిన్‌ల ద్వారా టీకాలు వేస్తున్నారు. అయితే.. మరో ముందడుగు వేసి ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అయిఏత.. నోటి ద్వారా వేసే వ్యాక్సిన్‌ వైపు అడుగులు వేస్తున్నారు నిపుణులు. అయితే.. నోటి ద్వారా తీసుకునే కొవిడ్ ఔషధం పాక్స్ లోవిడ్ ను ఫైజర్ ఫార్మా సంస్థ అభివృద్ధి చేయగా, దానికి జనరిక్ వెర్షన్ ను హెటెరో సంస్థ తయారుచేస్తోంది. ఇప్పుడీ జనరిక్ వెర్షన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రాథమిక అనుమతి ఇచ్చింది. నిర్మాట్రెల్విర్, రిటోనావిర్ ల కలయికలో పాక్స్ లోవిడ్ ఔషధాన్ని తయారుచేశారు.

Crores of cash found in bank lockers of Hetero Drugs!

ఈ ఔషధానికి డబ్ల్యూహెచ్ఓ ప్రపంచంలోనే తొలిసారిగా ప్రీక్వాలిఫికేషన్ అనుమతి తమకే ఇచ్చిందని హెటెరో వెల్లడించింది వ్యాక్సిన్లు తీసుకోనివారు, వృద్ధులు, ఇతర జబ్బులతో బాధపడుతున్నవారు, వ్యాధి నిరోధకశక్తి లేమితో బాధపడుతున్నవారు కొవిడ్ బారిన పడి ఆసుపత్రిలో చేరాల్సిన దశలో ఉన్నప్పుడు ఈ ఔషధాన్ని వాడొచ్చని సిఫారసులు ఉన్నాయి. డబ్ల్యూహెచ్ఓ అనుమతి పొందడం ద్వారా పాక్స్ లోవిడ్ జనరిక్ వెర్షన్ ను వీలైనంత వేగంగా, భారత్ తదితర మధ్యస్థ ఆదాయ దేశాల్లో 95 శాతం తగ్గింపు ధరలతో అందుబాటులోకి తెచ్చేందుకు హెటెరోకు వెసులుబాటు కలగనుంది. ఈ ఔషధ ఉత్పాదనకు సంబంధించి హెటెరోకు ఇప్పటికే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అత్యవసర వినియోగ అనుమతి కూడా లభించింది.

Read more RELATED
Recommended to you

Latest news