హైదరాబాద్ పాతబస్తీ లో టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కామెంట్స్ పై ఓల్డ్ సిటీ వ్యాప్తంగా పలు చోట్ల ఆందోళనలు చేపట్టారు ముస్లిం నిరసనకారులు. ఓల్డ్ సిటీ లో రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేసిన ఓ వర్గం.. శాలిబండ, హుస్సేనీ ఆలం, చార్మినార్ పీఎస్ పరిధిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.
ఇక అటు అర్థరాత్రి చార్మినార్ దగ్గరికి భారీగా ఆందోళన కారులు వచ్చి… నిరసన తెలిపారు. ఇక అటు చార్మినార్ దగ్గర పరిస్థితిని సమీక్షించి.. ఆందోళనకారులను క్లియర్ చేసారు సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య.
అయితే ఈ తరుణంలోనే పోలీసు వాహనాన్ని రాళ్లతో కొట్టి ధ్వంసం చేశారు ఆందోనళకారులు. మరోసారి తెల్లవారు జామున మూడు గంటలకు మళ్ళీ చార్మినార్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి.. నెలకొంది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీ ఛార్జ్ చేశారు పోలీసులు. పరిస్థితిని సమీక్షించారు అడిషనల్ సీపీ చౌహన్. ఈ నేపథ్యంలోనే ఆందోళనకారులతో మాట్లాడి.. వారిని ఇళ్లకు పంపించారు మలక్ పెట్ ఎమ్యెల్యే అహ్మద్ బలాల.
Late night visuals of protest against Raja Singh at Shahalibanda near Pista House. According to the police, the situation is tense but in control. #ProphetMuhammad #Hyderabad #RajaSingh #RajaHateVideo #RajaSinghArrested pic.twitter.com/Gpmwk8yJBL
— Mohammed Naseeruddin (@naseerCorpGhmc) August 23, 2022