వకీల్ సాబ్ రిలీజ్.. పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తతలు !

Join Our Community
follow manalokam on social media

ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయింది. మూడేళ్ళ తరువాత పవన్ తెర మీద కనిపిస్తూ ఉండడంతో అటు పవన్ అభిమానులతో పాటు ఇటు సామాన్య ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తి కనబరుస్తున్నారు. నిన్న రాత్రి నుండి థియేటర్స్ వద్ద పవన్ అభిమానుల హంగామా కొనసాగుతోంది. అయితే బెనిఫిట్ షోలు క్యాన్సిల్ చేశారు అనే కారణంగా తిరుపతిలో నాలుగు థియేటర్స్ మీద పవన్ ఫ్యాన్స్ దాడి చేశారు.

ప్రతాప్, మినీ ప్రతాప్, కృష్ణతేజ, శ్రీనివాస తేజ థియేటర్స్ మీద దాడి చేయడం సంచలనంగా మారింది. ఇక పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు లో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆందోళనకు దిగారు. వకీల్ సాబ్ బెనిఫిట్ షో ఉంటుందని అభిమానులు టికెట్లు కొన్నారు, కానీ షో వేయకపోవడంతో థియేటర్ మీద అభిమానులు దాడి చేసి ధర్నాకు దిగారు. కడప జిల్లా బద్వేల్ లో కూడా పవన్ అభిమానులు అత్యుత్సాహం చూపారు. థియేటర్ లో కుర్చీలు ధ్వంసం చేశారు. 

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...