అప్పుడు బాబు చేసిన అన్యాయం గుర్తు పెట్టుకున్నారు…?

-

ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని సమస్యలు క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా వస్తున్నాయనే విషయం అందరికి తెలిసిందే. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న సమయంలో చేసిన తప్పులు ప్రభావం ఇప్పుడు ఎక్కువగా కనబడుతుంది. ప్రధానంగా ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేల విషయంలో జరుగుతున్న తప్పులు ఇప్పుడు సమస్యలకు దారి తీస్తున్నాయి. గత ఎన్నికల్లో కొంతమంది బలమైన నేతలు గెలిచారు.

వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న సమయంలో మంత్రి పదవి కూడా ఆశించారు. కానీ చంద్రబాబునాయుడు వాళ్లకు మంత్రి పదవి లేకుండా పక్కనపెట్టారు. దీనితో ఇప్పుడు కొంత మంది ఎమ్మెల్యేలు పెద్దగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయకపోవడం పార్టీని ఇబ్బంది పెడుతున్న అంశం. తిరుపతి పార్లమెంటు పరిధిలో కొంతమంది గత ఎన్నికల్లో సీటు ఆశించారు. వాళ్లకు చంద్రబాబు నాయుడు అన్యాయం చేశారు.

దీంతో ఇప్పుడు వాళ్లు పార్టీ కోసం పని చేసే ప్రయత్నం చేయటంలేదు. వెంకటగిరి నియోజకవర్గం లో చాలామంది నేతలు సీట్లు అడిగినా సరే చంద్రబాబు నాయుడు వాళ్ళకి స్పష్టమైన హామీ కూడా ఇవ్వలేకపోయారు. ఇక వైసీపీ నుంచి పార్టీలోకి వచ్చిన కొంతమంది నేతలతో కూడా చంద్రబాబు నాయుడు ఇబ్బందికరంగా వ్యవహరించారు. ఎమ్మెల్యేలుగా భారీ మెజారిటీతో విజయం సాధించినా కూడా చంద్రబాబు నాయుడు గతంలో పట్టించుకున్న ప్రయత్నం చేయలేదు. అందుకే ఇప్పుడు వాళ్ళు అందరూ కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు. వైసీపీ లోకి వెళ్లే ఆలోచన లేకపోయినా సరే అప్పుడు తమకు అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు పార్టీ కోసం పని చేయడానికి సిద్ధంగా లేము అనే సంకేతాలు ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news