ఈ నెల 18 న ఆదిలాబాద్ లోని వార్డ్ నెంబర్ 29 లో కాల్పుల ఘటన కలకలం రేపింది. చేతిలో కత్తి, మరో చేతిలో తుపాకీ తో ఎంఐఎం కౌన్సిలర్, జిల్లా అధ్యక్ష్యుడు ఫారూఖ్ కాల్పులు జరిపారు. బులెట్ గాయాలతో గాయపడి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మాజీ కౌన్సిలర్ సయ్యద్ జమీర్ మృతి చెందారు. ఇక తీవ్రంగా గాయపడి ఆదిలాబాద్ ఆసుపత్రిలో సయ్యద్ మన్నాన్, సయ్యద్ మోథెశింలు చికిత్స పొందుతున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మృతుడి సోదరుడు .. ఫయాజ్ మాట్లాడుతూ ఫారూఖ్ కు మాకు ఎలాంటి విభేదాలు లేవు..కాల్పులు ఎందుకు జరిపాడో మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదని అన్నారు.
చిన్న క్రికెట్ గొడవలో తలదూర్చి..ఫారూఖ్ కాల్పులు జరిపాడన్న అయన చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి..మేము ఎలాంటి ఘర్షనల జోలికి వెళ్ళమని అన్నారు. ఫారూఖ్ తో పాటు ఆయనకు సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫయాజ్ డిమాండ్ చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహం ఆదిలాబాద్ కు తరలించనున్నారు పోలీసులు. నిమ్స్ లో పంచనామా నిర్వహించిన ఆదిలాబాద్ పోలీసులు ఆదిలాబాద్ మొత్తం హై అలర్ట్ చేశారు. గొడవలు తలెత్తే అవకాశం ఉండడంతో పెద్ద ఎత్తున పోలీసులు మొహరించారు.