కర్ణాటక రాష్ట్రంలో మళ్లీ తెరపైకి హిజాబ్ వివాదం ముందుకొచ్చింది. ఇటీవల కొందరు విద్యార్థినులు హిజాబ్ ధరించుకుని తరగతులకు హాజరవుతున్నారని మంగళూరు యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శనివారం స్పందించారు. హిజాబ్ వ్యవహారంలో ఎవరూ ఆందోళనకు దిగొద్దని హెచ్చరించారు. ఈ మేరకు కోర్టు తీర్పు వెలువరించిందని, ఆ తీర్పును ప్రతిఒక్కరూ పాటించాలని తెలిపారు. కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా.. పాటించాలని పేర్కొన్నారు. 99.99 శాతం ఉత్తర్వులు అమలవుతున్నాయని అన్నారు.
కాగా, మంగళూరు యూనివర్సిటీలో 44 మంది విద్యార్థినులు హిజాబ్ ధరించుకుని కాలేజీకి వస్తున్నారు. దీంతో కొందరు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కాలేజీ ప్రాంగణంలో హిజాబ్ ధరించరాదని మే 16న ఆదేశాలు జారీ చేశారని, హిజాబ్ ధరించరాదని నిషేధం విధించినా.. కాలేజీలో హిజాబ్ ధరించుకుని వస్తున్న ఘటన చోటు చేసుకుంది. దీంతో కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయడంలో యూనివర్సిటీ నిర్వాహకులు విఫలమయ్యారని విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు.