దేశ సేవలో ఎన్నడూ రాజీ పడలేదు: మోడీ

-

దేశ సేవలో ఎన్నడూ రాజీపడలేదని, గుజరాత్ నేర్పిన పాఠాలే తనకు స్ఫూర్తిని నింపాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కన్న కలలను నిజం చేస్తామని, భారతదేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. దేశ సేవలో ఈ ఎనిమిదేళ్లు ఎంతో నిజాయతీగా అభివృద్ధికి కృషి చేశామన్నారు. కాగా, మరికొద్ది నెలల్లో గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. దీంతో ప్రధాని మోడీ శనివారం గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీ పటేల్ సేవా సమాజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన కేడీపీ 200 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించారు.

ప్రధాని మోడీ
ప్రధాని మోడీ

ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. జన్‌ధన్ యోజన ద్వారా పేద ప్రజలకు ప్రయోజనం చేకూరిందన్నారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఉచితంగా టీకాలు అందించామని, అలాగే అనేక సంక్షేమ పథకాలు, సబ్సిడీలు అందిస్తున్నామన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేశ్ ఆశయాలకు అనుగుణంగా దేశ అభివృద్ధి జరుగుతోందన్నారు. కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలపై పరోక్షంగా విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news