కర్ణాటక ‘హిజాబ్’ వివాదం…. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం బొమ్మై

-

కర్ణాటకలో ‘హిజాబ్’ వివాదం కొనసాగుతూనే ఉంది. నేడు కర్ణాటక హైకోర్ట్ ముందుకు ఈ వివాదం చేరింది. గత కొన్ని రోజులుగా కర్ణాటకలోని ఉడిపి, చిక్ మంగళూర్, బెళగావి తదితర జిల్లాల్లో ఈ వివాదం సాగుతోంది. మెల్లిమెల్లిగా ఇతర జిల్లాలకు కూడా పాకుతోంది. ఓ వర్గం విద్యార్థులు హిజాబ్ ధరించి రాగా.. మరో వర్గం విద్యార్థులు కాషాయ కండువాలతో తరగతులకు హాజరుఅవుతున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. తాజాగా ఈరోజు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి, భాష్ప వాయువు కూడా ఫైర్ చేశారు. 

ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్ర బస్వరాజ్ బొమ్మై కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, కళాశాలలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు కర్ణాటక హైకోర్ట్ విద్యార్థులు సంయమనం పాటించాలని.. శాంతియుతంగా ఉండాలని అప్పీల్ చేసింది. మరోవైపు కర్ణాటక హైకోర్ట్ హిజాబ్ వివాదంపై కేసును రేపటికి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news