‘హిజాబ్’ తీర్పు ఇచ్చిన జడ్జిలకు ‘వై’ కేటగిరి సెక్యురిటీ… కర్ణాటక ప్రభుత్వ కీలక నిర్ణయం

-

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల హిజాబ్ పై కీలక తీర్పు చెప్పిన న్యాయమూర్తులకు సెక్యురిటీని పెంచనున్నట్లు కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై తెలిపారు. న్యాయమూర్తుకు ‘వై’ కేటగిరి సెక్యురిటీని కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల బెంగళూర్ విధానసౌధ పీఎస్‌లో కొందరు న్యాయమూర్తులకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు దాఖలైంది. ఈ ఫిర్యాదుపై  క్షుణ్ణంగా విచారణ జరపాలని డీజీ, ఐజీలను సీఎం బసవరాజ్ బొమ్మై ఆదేశించారు.

గత వారం కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రీతూ రాజ్ అవస్తీ, న్యాయమూర్తులు కృష్ణ ఎస్.దీక్షిత్, ఖాజీ జైబున్నెసా మొహియుద్దీన్‌లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం విద్యాలయాల్లో హిజాబ్ బ్యాన్ పై కీలక తీర్పు ఇచ్చింది. తరగతి గదుల్లో హిజాబ్ ధరించాలని డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్‌లను కొట్టివేస్తూ, హిజాబ్ ధరించడం ఇస్లాంలో అంతర్భాగం కాదని నొక్కి చెప్పింది. విద్యాసంస్థల్లో ఖచ్చితంగా యూనిఫామ్ ధరించాలని పేర్కొంది. గత కొన్ని రోజులుగా కర్నాటకలో వివాదం అవుతున్న హిజాబ్ వివాదంపై తీర్పు చెప్పింది.

ఇదిలా ఉంటే ‘ హిాజాబ్’ వివాదంపై తీర్పు చెప్పినందుకు జడ్జీలకు బెదిరింపులు వస్తున్నాయి. ప్రాణాలకు హాని కలిస్తాంటూ … బెదిరింపు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలా చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడుకు చెందిన కోవై రహ్మతుల్లాను తిరునల్వేలిలో అరెస్టు చేయగా, ఎస్ జామాల్ మహ్మద్ ఉస్మానిని తంజావూర్ లో అరెస్ట్ చేశారు తమిళనాడు పోలీసులు

Read more RELATED
Recommended to you

Latest news