భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే..?

-

సామాన్య ప్రజలకు పెట్రోల్, డీజల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. అసలే లాక్ డౌన్ నేపధ్యం లో ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న జనాలకి షాకిస్తూ వరుసగా ఆరో రోజు పెట్రోల్, డీజల్ ధరలు పెరిగాయి. లాక్ డౌన్ తర్వాత చమురు సంస్థలు అన్నీ కూడా మళ్ళీ సాధారణ స్థాయికి వచ్చినప్పటికీ మరోసారి డీజల్‌పై 59 పైసలు, పెట్రోల్‌పై 57 పైసల చొప్పున వడ్డించాయి. దీనితో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 74. 57 కాగా, డీజల్ రూ. 72.81కు చేరింది. ఇక వరుసగా ఆరు రోజుల్లో పెట్రోల్ ధర లీటర్‌కు రూ. 3.31 పెరగగా.. డీజిల్ ధర లీటరుకు రూ. 3.42 ఎగిసింది.

మెట్రో నగరాల్లో రేట్లు ఇలా ఉన్నాయి.

ఢిల్లీ – పెట్రోల్ రూ. 74.57, డీజిల్ రూ. 72.81

ముంబై – పెట్రోల్ రూ. 81.53, డీజిల్ రూ. 71.48

చెన్నై – పెట్రోల్ రూ. 78.47, డీజిల్ రూ. 71.14

హైదరాబాద్ – పెట్రోల్ రూ. 77.41, డీజిల్ రూ. 71.16

అమరావతి – పెట్రోల్ రూ.77.94, డీజిల్ రూ. 77.94

Read more RELATED
Recommended to you

Latest news