బీఆర్ఎస్ పార్టీని విస్తరించేందుకు.. సీఎం కేసీఆర్ వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా హిమాన్షు తివారిని నియమిస్తూ సీఎం కేసీఆర్ ప్రకటన విడుదల చేశారు. హిమాన్షు తివారి ఉత్తరప్రదేశ్ లోని జాన్పూర్ లో స్వాతంత్ర సమరయోధుడి కుటుంబానికి చెందినవారు.
ఇటీవల మహారాష్ట్రలోని బిఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా మాణిక్ కదమ్ ను నియమించిన గులాబీ బాస్ ఇప్పుడు మహారాష్ట్రపై దృష్టి పెట్టారు. బుధవారం మహారాష్ట్రలోని పలు డివిజన్లకు బిఆర్ఎస్ డివిజనల్ కోఆర్డినేటర్లను కేసీఆర్ నియమించారు. నాసిక్ డివిజనకు దశరథ్ సావంత్, పూణే డివిజన్ కు బాలాసాహెబ్ జైరామ్, ముంబై డివిజన్ కు విజయ్ తానాజీ మోహితే, ఔరంగాబాద్ డివిజన్ కు సోమనాథ్ తోరట్, నాగపూర్ డివిజన్ కు ధ్యానేష్ వకుద్కర్, అమరావతి డివిజన్ కు నిఖిల్ దేశముక్ లను నియమించారు.