చంద్రబాబు-పవన్ కలవడంపై వైసీపీ నేతలు వరుసపెట్టి ప్రెస్ మీట్లు పెట్టి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఓ వైపు విమర్శలు చేస్తూనే మరోవైపు ఎందరు కలిసొచ్చిన జగన్‌ని ఏం చేయలేరని అంటున్నారు. ఏం చేయలేనప్పుడు..ఎవరు కలిసిన వైసీపీ పట్టించుకోకుండా ఉండవచ్చు కదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఓ వైపు విమర్శలు చేస్తూనే..అందరినీ కలిపి జగన్‌ని ఓడిస్తారని వైసీపీ నేతలు ఛాలెంజ్ చేస్తున్నారు.
తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి సైతం ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. తమ అక్రమ సంబంధాలను సక్రమం అని చెప్పటానికి బాబు-పవన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఎంత మందిని కలిసినా మంచిదే..పంది కొక్కులు, ఎలుకలు, అన్నీ కలిస్తే ఎవరి విలువలు ఏంటో మరోసారి బయటపడుతుందని, అందరినీ కలిసి ఒకేసారి ఓడించే అవకాశం కూడా జగన్‌కు వస్తుందని సజ్జల అన్నారు. అయితే కొన్ని లాజిక్‌లు అర్ధం కాకుండా ఉంది. ఎవరు కలిసొచ్చిన ఓడిస్తామని అంటున్నారు..అలాంటప్పుడు ఎవరు కలిస్తే వైసీపీ నేతలకు ఇబ్బంది ఎందుకు..ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించడం ఎందుకని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
పవన్-చంద్రబాబు జస్ట్ అలా కలిస్తేనే జగన్ ఎందుకు భయపడుతున్నారుని, సాధారణ కలయికకే ఇంతలా భయపడితే.. రేపు పొత్తు కుదిరితే జగన్ రాష్ట్రం విడిచి పోవటం ఖాయమని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. మొత్తానికి బాబు-పవన్ కలవడంపై పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది. ఇక ఎవరి రాజకీయం వారు చేస్తున్నారు. వైసీపీ ఏమో..జగన్ సోలోగా ఫైట్ చేస్తున్నారని, ఆయనకు జనమే తోడు అని చెప్పి సెంటిమెంటే లేపే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఇటు బాబు-పవన్ ఏమో..జగన్ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తున్నారని, అందుకే తామంతా ఏకమై పోరాడుతున్నామని అంటున్నారు. మరి చూడాలి చివరికి ప్రజలని ఎవరిని నమ్ముతారో.