పంచాయతీ ఎన్నికల ఎఫెక్ట్ : వచ్చే నెలలో నాలుగు రోజులు సెలవులు.

-

పంచాయతీ ఎన్నికల దృష్ట్యా వచ్చే నెల 9, 13,17,21 తేదీల్లో సెలవులు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ఆయా తేదీల్లో ఎక్కెడక్కడ పోలింగ్ జరుగుతుందో ఆ ప్రాంతాల్లో శెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, దుకాణాలకు సెలవులు ప్రకటిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వ భవనాలను పోలింగ్ కేంద్రాలుగా వినియోగించుకునేందుకు సెలవులు ప్రకటిస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.

అంతే కాక పోలింగ్ తేదీకి 44 గంటలు ముందుగా మద్యం విక్రయాల నిలిపివేయనున్నారు. బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రి తరలింపునకు వివిధ ప్రభుత్వ శాఖల వాహనాలను కూడా సన్నద్ధం చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. అంతే కాక ఎలక్షన్ ఎజెంట్లుగా ప్రభుత్వ ఉద్యోగులెవరూ వ్యవహరించొద్దని స్పష్టం చేశారు. ఇక ఎన్నికల విధులకు వాలంటీర్లు దూరంగా ఉండాలని ఎన్నికల కమిషనర్ ఆదేశించిన క్రమంలో వారు ఎన్నికల విధులకు దూరంగా ఉండనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news