అద్దిరిపోలా : హాలీవుడ్ డైరెక్టర్ తో జూనియర్ ఎన్టీఆర్ సినిమా ?

-

టాలీవుడ్ సూపర్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తాజాగా తీసిన సినిమా ఆర్ ఆర్ ఆర్ తో తన కీర్తి ప్రపంచమంతటా పాకింది. దీనికి ప్రత్యక్ష సాక్ష్యమే ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ గన్ చేసిన వ్యాఖ్యలు. జేమ్స్ గన్ తాజాగా మాట్లాడుతూ రాజమౌళి ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమాను చూశానని, ఇందులో నటించిన ప్రతి ఒక్కరు అద్భుతంగా చేశారని కొనియాడారు. ప్రత్యేకంగా ఇందులో కొమరం భీం గా నటించిన జూనియర్ ఎన్టీఆర్ నటన పట్ల ఈయన చాలా ఆకర్షితుడయినట్లు తెలుస్తోంది. నా జీవితంలో కనీసం ఒక్క సినిమా అయినా జూనియర్ ఎన్టీఆర్ తో తీయాలని తన మనసులో ఉన్న మాటను వెలిబుచ్చారు.

త్వరలోనే ఎన్టీఆర్ కోసం మంచి పాత్రణలు సిద్ధం చేస్తానని చెప్పారు. ఈ వార్తను చూసిన ఇండియా సినీ ప్రేమికులు గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఇక ఎన్టీఆర్ అభిమానుల గురించి అయితే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, గర్వంతో ఎన్టీఆర్ ఫ్యాన్ అని చెప్పుకుంటున్నారు. మరి వీరిద్దరి కాంబోలో సినిమా ఎప్పుడు వస్తుందో చూద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news