భారత్‌లో జనాభాపై వ్యంగ్యంగా జర్మనీ కార్టూన్‌.. మండిపడ్డ నెటిజన్లు

-

ఇండియాలో జనాభా పెరుగుదలపై జర్మనీకి చెందిన మైగజీన్‌ ఆర్టిస్ట్‌ ఒకరు గీసిన కార్టూన్‌ పట్ల నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. డేర్‌ స్పేజెల్‌ అనే జర్మనీ మేగజైన్‌ భారత్‌లో జనాభా పెరుగుదలను ఉద్దేశిస్తూ వ్యంగ్యంగా ఒక కార్టూన్‌ను ప్రచురించింది. అందులో భారతీయులతో కిక్కిరిసిన రైలు.. చైనా బుల్లెట్‌ ట్రైన్‌ను దాటి వెళుతుంటే.. అందులోని లోకో పైలట్లు భారత్‌ రైలును చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్లుగా చూపించారు.

ఈ కార్టూన్ చూసిన నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ‘జర్మనీ జాత్యహంకారానికి ఇది నిదర్శనం’, ‘భారత్‌ను అవమానకరంగా చిత్రీకరించే ప్రయత్నం’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ కూడా దీనిపై స్పందించారు. ‘‘ భారత్‌ను అపహాస్యం చేసేందుకు మీరు ఎంత ప్రయత్నించినా.. ప్రధాని మోదీ నాయకత్వంలో మరి కొన్నేళ్లలో జర్మనీ కంటే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరిస్తుంది’’ అని ట్వీట్ చేశారు. ఆయనతోపాటు పలువురు ప్రభుత్వ సలహాదారులు, పలు రాజకీయ పార్టీల నాయకులు కూడా ఈ కార్టూన్‌ను తప్పుబట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news