‘ఫహద్‌ ఫాసిల్’ మూవీ గురించి హోంబలే ఫిలిమ్స్‌ అప్డేట్

-

 

స్టార్ హీరో ‘ఫహద్ ఫాసిల్’ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ధూమమ్’కు సంబంధించి ‘హోంబలే ఫిలిమ్స్’ తాజా అప్డేట్ ఇచ్చింది. ఈ మూవీ ఫస్ట్ లుక్ను రేపు ఉదయం 10.45 గంటలకు లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. ‘కేజీఎఫ్‌ సినిమాతో టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది టాప్ బ్యానర్ హోంబలే ఫిలిమ్స్‌ . ఆ తర్వాత కేజీఎఫ్‌తోపాటు మరో బ్లాక్ బస్టర్‌ కాంతారను కూడా ప్రేక్షకులకు అందించి బాక్సాఫీస్‌ వద్ద రికార్డుల వర్షం కురిపించింది

KGF', 'Kantara' producer Hombale Films to invest Rs 3,000 crore in Indian  film industry

 

ప్రతి పొగ ఒక రహస్యాన్ని దాచిపెడుతుంది. ఉత్కంఠభరితమైన సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాలో హృదయాన్ని కదిలించే రైడ్ కోసం రెడీగా ఉండండి.. అంటూ హోంబలే ఫిలిమ్స్‌ మేకర్స్‌ అప్‌డేట్ ఇచ్చి సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నారు.ఈ చిత్రంలో అచ్యుత్‌ కుమార్‌, జాయ్‌ మాథ్యూ, దేవ్‌ మోహన్‌, అనూ మోహన్‌, నందు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ధూమమ్ మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఫహద్‌ ఫాసిల్‌ మరోవైపు తెలుగులో సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఫస్ట్‌ పార్టుకు కొనసాగింపుగా వస్తున్న పుష్ప.. ది రూల్‌లో కూడా నటిస్తున్నాడు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news