Breaking : ట్రాన్స్‌జెండర్లకు శుభవార్త చెప్పిన సీఎం జగన్

-

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్‌జెండర్లకు శుభవార్త చెబుతూ వారికోసం ప్రత్యేక పాలసీని అమల్లోకి తెచ్చింది. ట్రాన్స్ జెండర్లకు మంచి వైద్యం, విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని నిర్ణయించింది. ట్రాన్స్ జెండర్లకు సామాజిక భద్రత కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం పాలసీని అమలు చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్ జెండర్లకు గుర్తింపు కార్డులను జారీ చేయనుంది.

A year after Konaseema caste riots, why Andhra govt wants to withdraw all  cases

ఇప్పటికే బడ్జెట్‌లో రూ.2 కోట్లుఇప్పటికే ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రస్తుత బడ్జెట్‌లో రూ. 2 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. అలాగే నవరత్నాల ద్వారా హిజ్రాలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ట్రాన్స్ జెండర్ల భవిష్యత్ కోసం మరికొన్ని చర్యలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ట్రాన్స్ జెండర్లు నివసించే ప్రాంతాల్లో మంచినీటి సరఫరా, పారిశుధ్య సదుపాయాలు కల్పించడంతోపాటు వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను కల్పించాలని నిర్ణయించింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news