వయసు పెరిగితే సరిపోదు, బుద్ధి కూడా పెరగాలి.. కౌంటర్ ఇచ్చిన హోం మంత్రి…!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావ౦ ఏమో గాని అధికార విపక్షాల మధ్య రాజకీయ మాత్రం ఆగడం లేదు. టీడీపీ నేతలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఏదోక విమర్శ చేస్తూనే ఉన్నారు. కరోనాపై జగన్ పోరాటాన్ని ఏదోక రూపంలో ఎగతాళి చేస్తూనే ఉన్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరీ… సిఎం జగన్ మాట్లాడిన ఒక మాటను ప్రస్తావిస్తూ ఒక ట్వీట్ చేసారు. వీలైనంత వరకు లాగేద్దాం అని ఒక మూడు సెకన్ల క్లిప్ ని పోస్ట్ చేసారు.

ఇది టీడీపీ సోషల్ మీడియా విస్తృతంగా వైరల్ చేసింది. దీనిపై హోం మంత్రి మేకతోటి సుచరిత కౌంటర్ ఇచ్చారు. జగన్ మాట్లాడిన ఒరిజినల్ వీడియో ని ఆమె పోస్ట్ చేసారు. వయసు పెరిగితే సరిపోదు, బుద్ధి కూడా పెరగాలి GORANTLA_BC గారూ! వీలైనంత వరకు కాంట్రాక్టు ఉద్యోగుల్ని ప్రభుత్వంలోకి లాగేద్దాం అన్న జగన్ గారి మాటలను ఇలా 3సెకన్ల వీడియోతో దిక్కుమాలిన ట్వీట్లు చేస్తూ యువతకు ఏం మెసేజ్ ఇస్తున్నారు..?

హుందాగా ప్రవర్తించండి, ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని ఆమె ట్వీట్ చేసారు. వాస్తవానికి జగన్ పాదయాత్ర సందర్భంగా ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చేసిన వ్యాఖ్యలవి. ఇక ఎప్పటి మాదిరిగానే టీడీపీ సోషల్ మీడియా విభాగ౦ పదే పదే వాటిని వాట్సాప్ స్టేటస్ లు గా పెట్టడమే కాకుండా విమర్శలు కూడా చేస్తూ ఎగతాళి చేస్తూ పోస్ట్ లు పెట్టడం గమనార్హం. హోం మంత్రి ఇచ్చిన షాక్ తో ఒక్కసారిగా కంగు తిన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news