ఫోన్ ట్యాపింగ్.. నారా లోకేశ్ మానభంగం.. బాబుకి సుచరిత కౌంటర్..!

-

ఆంధ్రప్రదేశ్ లో ప్రాధమిక హక్కులు కాలరాస్తున్నారని.. ప్రతిపక్ష నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లను వైసీపీ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ కూడా రాశారు. అయితే తాజాగా దీనిపై ఏపీ హోం మంత్రి సుచరిత స్పందించారు. ఈ విషయంపై మంత్రి సోమ‌వారం మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు అసత్య ప్రచారాలు చేయడం నిజంగా సిగ్గుచేటు.

అలాగే జడ్జ్ ల ఫోన్లు ట్యాపింగ్ చేశారని నిరాధార ఆరోపణలు చేయడం నిజంగా బాధాకరమని ఆమె అన్నారు. సుదీర్ఘ కాలం సీఎంగా పని చేసిన వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేయడం తగదని, నారా లోకేశ్ మానభంగం చేశారని తాము ఆరోపిస్తే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంపై బురద చల్లడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తే మీ మనీ లాండరింగ్‌  వ్యవహారం బయటకు వస్తుందని భయపడుతున్నారా? అని ఆమె ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news