కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. భారత్ పై దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. రోజురోజుకి పెరిగిపోతున్న కేసులతో ప్రజలు హడలిపోతున్నారు. సాధారణ ప్రజలతో పాటూ అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. అలాగే ఈ మహమ్మారి సోకి ఇప్పటికే అనేకమంది మరణించగా.. మరికొందరు కొలకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా.. భారత బాక్సర్ లైశ్రమ్ సరితా దేవి కరోనా బారిన పడ్డారు.
తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని సోమవారం తెలిపారు. గడిచిన మూడు రోజులుగా తనను జ్వరం, కండరాల నొప్పితో బాధిస్తుండడంతో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని ఆమె పేర్కొన్నారు. తన భర్తకు సైతం పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, కుమారుడికి మాత్రం నెగిటివ్ వచ్చిందని ఆమె వెల్లడించారు.