రోజురోజుకీ చెప్పులు యొక్క డిజైన్లు కూడా మారుతున వస్తున్నాయి. అయితే చెప్పులు అంటే మనకి గుర్తొచ్చేవి హవాయి చెప్పులు. చాలా ఏళ్ల నుంచి కూడా హవాయి చెప్పులు ఉన్నాయి. అయితే దీనికి హవాయి అనే పేరు ఎలా వచ్చింది ఎలా వచ్చిందో మీకు తెలుసా..? అయితే మరి దాని కోసమే ఇప్పుడు చూద్దాం. అసలు ఈ చెప్పులకి ఆ పేరు రావడం వెనుక పెద్ద కథ ఉంది.
హవాయి చెప్పులు ఈ ప్రపంచంలో వివిధ దేశాలలో పలు పేర్లతో పిలుస్తారు. మన భారతదేశంలో మాత్రమే హవాయి అని పిలుస్తారు. ఈ చెప్పులు కేవలం భారత దేశంలో మాత్రమే కాకుండా ఈజిప్టు, జపాన్ చైనాలో కూడా ఉంటాయి. అయితే ఈ చెప్పుల కి ఆ పేరు రావటం వెనుక ఒక కారణం ఉంది అని చరిత్రకారులు అన్నారు. అమెరికాలో ఉన్న హవాయి ద్వీపం నుండి ఈ పేరు వచ్చింది అన్నారు.
ఈ ద్వీపంలోని టీ అనే చెట్టుకున్న రబ్బర్ నుంచి చెప్పులు తయారు చేస్తారు. ఈ కారణం వల్లనే వీటికి ఆ పేరు వచ్చింది. పైగా చెప్పులు గాలిలా తేలికగా ఉంటాయి. అందుకనే వీటికి హవాయి చెప్పులు అనే పేరు వచ్చింది అని కూడా అంటూ ఉంటారు. ఇదిలా ఉంటే 1880లో జపాన్ లోని గ్రామీణ ప్రాంతాల నుండి కర్మాగారాల్లో పని చేయించడానికి అమెరికాలోని హవాయి దీవులు కి తీసుకు వచ్చారని అంటారు. ఇలా ఆ చెప్పులకి పేరు వచ్చింది.