నేను దర్శకత్వం వహించిన సినిమాకు జీవిత రాజశేఖర్ వాళ్ళ పేర్లు వేసుకున్నారు..!

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ సినిమా కెరియర్ లో చెప్పుకోదగిన సినిమాలలో ఎవడైతే నాకేంటి సినిమా ఒకటి. సింహరాశి సినిమా తర్వాత వరుస పరాజయాలలో ఉన్న రాజశేఖర్ కు ఎవడైతే నాకేంటి సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం దక్కింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను దర్శకుడు సముద్ర తెలియజేశాడు.

ఇంటర్వ్యూ లో భాగంగా సముద్ర గారికి మీకు సినిమా ఇండస్ట్రీలో ఎవరితో బేధాభిప్రాయాలు రాలేదా అని ప్రశ్న ఎదురైంది. దానికి సమాధానమిస్తూ సముద్ర గారు… ఇండస్ట్రీలో నాకు ఒక రాజశేఖర్ తో మాత్రమే భేదాభిప్రాయం ఏర్పడింది. సింహరాశి సినిమా తర్వాత రాజశేఖర్ కు వరుస ప్లాప్ లు వచ్చాయి, ఆ తర్వాత కొన్ని సార్లు రాజశేఖర్ కొన్ని సినిమాలు నన్ను చేయమని అడిగాడు, కానీ ఆ సబ్జెక్ట్ లు నాకు నచ్చక నేను చేయలేదు. కానీ రాజశేఖర్ నాతో సినిమా చేయడం ఇష్టం లేకే ఇలా అంటున్నాడు అని మిస్ అండర్స్టాండింగ్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఎవడైతే నాకేంటి సినిమా సబ్జెక్ట్ నచ్చి నేనే చేస్తాను అని చెప్పాను. ఆ సినిమా స్టార్ట్ అయ్యింది.

సినిమా దాదాపుగా పూర్తవడానికి వచ్చింది. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొడుతున్నాము అనే నమ్మకం మాకు ఏర్పడింది. అయితే ఆ తర్వాత నుండి వారు నన్ను సినిమా నుండి తీసివేసి దర్శకుడిగా వారి పేరును వేసుకుందాము అని అనుకున్నారు. నేను కూడా ఈ సినిమా నుండి బయటకు వెళ్లిపోయాను. అప్పటికే సినిమా దాదాపుగా 80 శాతం వరకు పూర్తి అయ్యింది. ఆ తర్వాత మళ్లీ రాజశేఖర్, జీవిత పిలిచి నాతో సినిమా చేయించారు. సినిమా మొత్తం పూర్తి అయ్యాక మళ్లీ దర్శకుడిగా వాళ్ల పేరే వేయించుకున్నారు అని దర్శకుడు సముద్ర తాజా ఇంటర్వ్యూలో తెలియజేశాడు.