ఫోన్లో నెట్వర్క్ లేనప్పటికీ కూడా ఎమర్జెన్సీ కాల్స్ వెళ్తూ ఉంటాయి. ఎప్పుడైనా మీకు ఈ డౌట్ వచ్చిందా..? ఎందుకు ఎమర్జెన్సీ కాల్స్ వెళ్తున్నాయి..? నెట్వర్క్ లేక పోయినా అని… మనం ఫోన్ ద్వారా ఎమర్జెన్సీ కాల్స్ ని చేసుకోవచ్చు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఫోన్ ఎక్కువ వాడుతున్నారు. ఫోన్ల కి సంబంధించిన అన్ని విషయాలు కూడా అందరికీ తెలుస్తున్నాయి. ఫోన్ లాక్ లో ఉన్నప్పుడు అన్లాక్ సమయంలో ఎమర్జెన్సీ కాలనీ ఆప్షన్ మనకి కనబడుతుంది.
దానిమీద క్లిక్ చేస్తే డయల్ ఎస్వో ఎస్ నెంబర్ 112 అని వస్తుంది పోలీసులకి అంబులెన్స్ ఫైర్ సిబ్బందికి ఆపదలో కాల్ చేయడం కోసం దీనిని వాడతారు. అయితే నెట్వర్క్ లేకపోయినా ఫోన్ లాక్ లో వున్నా అత్యవసర కాల్ కనెక్ట్ అవుతుంది. అది ఎలా పని చేస్తుంది అనే విషయానికి వచ్చేస్తే… సమీపంలో ఉన్న నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్ టవర్ కి మెసేజ్ ఫోన్ ద్వారా వెళుతుంది కాల్ కనెక్ట్ అవుతుంది. కొన్ని సెకండ్లలోనే ఇది అయిపోతుంది.
ఎమర్జెన్సీ కాల్ విషయంలో కూడా ఇలా జరుగుతుంది. నెట్వర్క్ లేకపోతే ఏ మొబైల్ నెట్వర్క్ అయితే అందుబాటులో ఉంటుందో దాని నుండి ఫోన్ కనెక్ట్ అవుతుంది మొబైల్ ఆపరేటర్ నుండి నెట్వర్క్ రాక పోయినప్పుడు ఇలా జరుగుతుంది. ఇలా ఫోన్లో నెట్వర్క్ లేకపోయినా సమీపంలో ఉండే నెట్వర్క్ ద్వారా ఎమర్జెన్సీ కాల్ కనెక్ట్ అవుతుంది అందుకే ఎమెర్జెన్సీ కాల్ వెళ్తుంది.