ఫ్యాక్ట్ చెక్: పేదలకి కేంద్రం సహాయంగా రూ.32,849… నిజమేనా..?

-

ఈరోజుల్లో సోషల్ మీడియాలో ఎన్నో నకిలీ వార్తలు మనకి కనబడుతున్నాయి. నకిలీ వార్తలతో జాగ్రత్తగా ఉండకపోతే అనవసరంగా మోసపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చాలా మంది సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నిజం అని నమ్ముతూ ఉంటారు అటువంటి వార్తలతో జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందుల్లో పడాల్సి ఉంటుంది. ప్రభుత్వ స్కీముల మొదలు ఉద్యోగాల వరకు చాలా నకిలీ వార్తలు తరచూ మనకు సోషల్ మీడియాలో కనబడుతూ ఉంటాయి.

తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది మరి అది నిజమా కాదా… దానిలో నిజం ఎంత అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం… ప్రభుత్వ స్కీములు పేరుతో చాలా మంది మోసాలు చేస్తున్నారు ఒకవేళ కనుక ఇటువంటి వాటిని నిజం అని నమ్మితే అకౌంట్ సున్నా అయిపోతుంది ఆర్థిక మంత్రిత్వ శాఖ రూ. 32,849 ని పేదలకి ఇస్తోందని వార్తలో ఉంది మరి నిజంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ డబ్బులని అందిస్తుందా నిజం ఎంత అనేది చూస్తే… ఇది నకిలీ వార్త అని తెలుస్తోంది.

ఇందులో ఏమాత్రం నిజం లేదు భారతీయ ప్రజల్లో చాలామంది పేదవాళ్లు ఉన్నారని వాళ్ళకి సహాయం కింద ప్రతి ఒక్కరికి 32,849 రూపాయలు వస్తాయని వచ్చిన వార్తల్లో నిజం లేదు ఇటువంటి నకిలీ వారితో మాత్రమే. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించింది. ఇది వట్టి నకిలీ వార్త అని తేల్చి చెప్పేసింది. కనుక అనవసరంగా ఇటువంటి నకిలీ వార్తలని నమ్మి మోసపోకండి.

Read more RELATED
Recommended to you

Latest news