ఏ పప్పును ఎంత సేపు నానపెట్టాలి..? ఎక్కువ సేపు నానితే పోషకాలు పోతాయా..?

-

పప్పులు ఏవైనా ఆరోగ్యానికి చాలా మంచివి. మాంసకృతులు బాగా ఉంటాయి. సాధారణంగా  ఏ పప్పునైనా నానపెట్టే వండుకుంటారు.. అయితే ఈ నానపెట్టడంలోనే ఒక్కో పప్పు ఒక్కో టైమ్‌ను తీసుకుంటుంది. మినపప్పు నానడానికి చాలా టైమ్‌ పడుతుంది. అసలు ఏ పప్పు ఎంత సేపు నానపెట్టాలి.. మనం కొన్నింటిని తెలిసి తెలియక అవి మెత్తగా అయిపోయాయి కదా అని వాడేస్తాం.. పప్పులు నానపెట్టినప్పుడు ఒక ప్రక్రియ జరుగుతుంది.. అది కంప్లీట్‌గా జరిగినప్పుడే వాటిని తిన్నప్పుడు మనకు ఎలాంటి సమస్యలు రావు. అందుకే ఏ పప్పును ఎంతసేపు నానబెట్టాలో తెలుసుకుందాం.
మీరు కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు కనీసం 6 నుంచి 8 గంటలు పూర్తిగా నీటిలో నానబెట్టాలి. ఇక మినుములు, పెసల వంటి వాటిని కనీసం 8 నుంచి 12 గంటల పాటు నానబెట్టాలి. శెనగలు, బీన్స్, రాజ్మా వంటి వాటిని 12 నుంచి 18 గంటలు నానబెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయట. చాలా మంది ఉదయం టిఫిన్ కోసం.. రాత్రి లేదా ముందు రోజు సాయంత్రం నానబెడతారు. మీరు వేటిని నానబెట్టాలనుకున్నా… ముందుగా వాటిని బాగా 3 సార్లైనా కడగాలి. అలాగే నానబెట్టిన తర్వాత కూడా కనీసం 2 సార్లైనా బాగా కలుపుతూ క్లీన్‌ చేయాలి.. తద్వారా వాటి నుంచి రిలీజైన గ్యాస్ బయటకు పోతుంది. ఇలా కడగడం వల్ల పోషకాలు పోతాయేమో అనుకోవద్దు. పోషకాలు పప్పులతోనే ఉంటాయి. ఈ నీటిని మీరు పెరట్లో మొక్కలకు పొయ్యవచ్చు. తద్వారా నీరు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది.
కందిపప్పు, పెసరపప్పు, శెనగపప్పు, బీన్స్, రాజ్మా, శెనగలు.. ఇలాంటి వాటిని నానబెట్టినప్పుడు.. వీటిలో ఫైటేస్‌ (phytase enzyme) అనే ఎంజైమ్‌ ఏర్పడుతుంది. దీని వల్ల మనం వాటిని తిన్నప్పుడు.. వాటిలోని పోషకాలు త్వరగా శరీరంలోకి వెళ్తాయి. అలాగే.. పప్పులను నానబెట్టినప్పుడు.. వాటిలో అమైలేస్ అనే ప్రక్రియ జరుగుతుందట… ఈ ప్రక్రియలో.. పప్పుల్లో పిండి పదార్థం లూజు అవుతుంది. అందువల్ల అవి తిన్నప్పుడు గ్యాస్, ఏసీడీటీ ఇతరత్రా కడుపులో సమస్యలు రావు. అందుకే బాగా నానబెట్టాలి.

Read more RELATED
Recommended to you

Latest news